Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మికతో డేటింగ్ పై విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానం ఇదీ..! 

Is Vijay Deverakonda dating Rashmika Mandanna
  • తాము మంచి స్నేహితులమన్న విజయ్ 
  • రష్మిక తనకు ప్రియమైన, ఇష్టమైన వ్యక్తిగా వెల్లడి
  • రిలేషన్ షిప్ గురించి సందర్భం వచ్చినప్పుడు చెబుతానన్న లైగర్ హీరో
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ప్రేమాయణం ఉందని, వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చన్న వదంతులు లోగడ వచ్చాయి. ఈ పుకార్లలో నిజమెంతో తెలుసుకోవాలని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జొహార్ ప్రయత్నించారు. పుష్ప స్టార్ రష్మికతో డేటింగ్ పై వచ్చిన పుకార్ల సంగతి ఏమిటని ప్రశ్నించారు. దీనికి విజయ్ దేవరకొండ అలాంటిది ఏమీ లేదని, అయితే బదులు ఇవ్వలేదు. మంచి స్నేహితులమని చెప్పాడు. 

‘‘కెరీర్ ఆరంభంలోనే మేము రెండు సినిమాలు కలసి చేశాం. ఆమె నాకు ప్రియమైన వ్యక్తి. ఆమెను ఇష్టపడుతున్నాను. మేము నిజంగా మంచి స్నేహితులం. సినిమాల ద్వారా ఎంతో షేర్ చేసుకుంటాం. దాంతో బంధం ఏర్పడుతుంది’’ అని విజయ్ చెప్పాడు. 

‘నీ రిలేషన్ షిప్ ఏంటన్నది ఎందుకు చెప్పవు?’ అని కరణ్ ప్రశ్నించాడు. నేను దీని గురించి బిగ్గరగానే చెబుతాను. అప్పటి వరకు నన్ను ఆరాధించే వారిని బాధపెట్టను. నటుడిని ఎంతో మంది ప్రేమిస్తారు. వారి గోడలు, ఫోన్లలో పోస్టర్లు పెట్టుకుని ఆరాధిస్తారు. వారు ఎంతో ప్రేమ, ప్రోత్సాహాన్నిస్తారు. కనుక వారి హృదయాలను గాయపరచాలని అనుకోవడం లేదు’’ అని విజయ్ వివరించాడు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజయ్, రష్మిక కలసి పనిచేశారు.  
Vijay Deverakonda
Rashmika Mandanna
Dating
relationship
Koffee With Karan
Karan Johar

More Telugu News